శ్రీమతి రత్నా శ్రీనివాస్
కావలసిన
వస్తువులు:
టమేటాలు
1 కేజీ
ఉప్పు
తగినంత
పసుపు
తగినంత
చింతపండు
50 గ్రాములు
కారం
50 గ్రాములు
(ఎక్కువ
కావాలనుకునే వారు అదనంగా వేసుకోనవచ్చును)
మెంతి
పిండి
2 టేబుల్ స్పూన్స్
నూనె
250 ml
ఆవాలు
1-2 టేబుల్
స్పూన్స్
ఇంగువ
కావలసినంత
ఎండు
మిర్చి
2
తయారు
చేయు విధానం :
ఊరగాయ కోసం ఎర్రగా, కొంచెం గట్టిగా వున్న టమేటాలను
ఎంచుకోవాలి. వాటిని శుబ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తడి లేదని నిర్ధారించుకున్నాక,
ముక్కలుగా తరుక్కుని జాడీలో కాని సీసాలో కాని వేసుకోవాలి. ముక్కలకి తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలి. రెండో రోజున ముక్కలకి ఉప్పు వేయటం వలన
ఊట ఊరుతుంది. తరువాత ముక్కలను ఊట లోంచి తీసి పళ్ళెంలో కాని చేటలో కాని వేసి ఎండ బెట్టుకోవాలి. ఇప్పుడు చింత పండుకి పీచు, గింజలు
తీసి గుండ్రంగా బంతి లాగ చేసి టమేటా ఊట లో వేసుకోవాలి. ముక్కలు 2,3 రోజులకి బాగా ఎండుతాయి.
ఊట లో వున్న చింతపండు కూడా చక్కగా మెత్తగా నానిపోతుంది.
నానిన చింతపండు ని బైటకి తీసి, ఊట లో మెంతి పిండి, పైన చెప్పిన పరిమాణంలో సగం కారం ఉండలు లేకుండా సమానంగా కలుపుకొవాలి. ఎండిన టమేటా ముక్కలు, నానిన చింతపండుని గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే
మెంతి పిండి, కారం కలిపిన వూటని కూడా గ్రైండర్ లో ముక్కలతో
పాటుగా వేసుకోవచ్చును.
ఒక
బాండీ తీసుకుని నువ్వుల నూనె పోసి వేడెక్కేక ఆవాలు, ఎండు మిర్చి ఇంగువ వేసి పోపు
పెట్టుకుని చల్లరేక పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇపుడు ఘుమ ఘుమ లాడే ఇంగువ పోపుతో
టమేటా పచ్చడి తయార్!
No comments:
Post a Comment