Monday, December 22, 2014

కామాక్షి వంటింటి కబుర్లు: ‘చేమ దుంపోపాఖ్యనం!’ ముగింపు!


ముందుమాట: 
కామాక్షి వాలకం చూస్తే, చేమ దుంపల వేపుడుకి ఎదో ఉపద్రవం  మరియు విశ్వనాధానికి ఎదో తీవ్ర ఆశాభంగం కలిగేలాగా కనబడుతోంది. సమయం సాయంత్రం అవుతోంది ; విశ్వనాధం ఇహనో ఇప్పుడో రావచ్చు; మరి మూకుట్లో పెను తుఫాను వచ్చేలోగా మనం కాస్త తప్పుకుని జరిగేదో దూరంనుంచే చూడటం శ్రేయస్కరం!

రమణ బంధకవి

సంపాదకుడు


చామదుంపలు  - శ్రీ వారు – ఇంటర్వెల్ తరువాత!

శ్రీమతి రత్నాశ్రీనివాస్

....బుట్టలోంచి చామదుంపలు తీసి పంపు కింద పెట్టి సుబ్బరంగా మట్టిపోయేలాగా  ఒకటికి రెండు సార్లు కడిగిందిప్రెషర్ పాన్ తీసి,చామ  దుంపలు పెట్టిసరిపడా నీళ్ళు పోసి 
కొంచెం పసుపు వేసి మూత పెట్టిందిమూడు కూతలు వచ్చాక స్టవ్ ఆపి,చల్లారాక దుంపలు బైటకి  
తీసింది. భర్తఆరోగ్యం కోసం మనసు పెట్టి చేసిందేమో దుంపలు మెత్తగా వుడికాయితొక్క తీసి,నాన్ స్టిక్ మూకుడిని స్టవ్ వెలిగించి పెట్టింది. 

మామూలు బాండి ఐతే పోపు కూర కదాకలిపినపుడు ముద్ద ఐతే విశ్వనాథం గొడవ చేస్తాడు.
కొంచెం నూనె వేసి ఎండు మిరపకాయలు రెండు,మూడు తుంపి వేసిన్దితలా కొంచెం మినప పప్పు,
ఆవాలుజీలకర్ర వేసి పోపుచిటపట లాడేక, కమ్మటి పాల ఇంగువ వేసింది.పచ్చగాతాజాగా  
వున్నకరివేపాకు రెబ్బలు వేసి పైన చేమదుంపలు వేసిన్ది.పిల్లాడు పట్టాభి పోపు కూర తినడు 
తిండి విషయంలో కొంచెం పేచికోరుపంతాలమారిఅందుకని కొన్ని దుంపలు వాడికి వేపుడు
చేయటం కోసమని అట్టే పెట్టిందిఉప్పు,పసుపు వేసి కొంచెం కలియబెట్టి మూత పెట్టిందిప్రక్కనే ఒక
చిన్నకప్పులో చింతపండు నానబెట్టిందిదుంపలు మగ్గేక కొద్దిగా చింతపండు పులుసు  వేసిచిన్నబెల్లం ముక్క కూడా వేసిన్దిదుంపలు చితకకుండా జాగ్రత్తగా ఓమారు కలిపి మూత పెట్టింది.
కొంతసేపటికి దుంపలు  పులుసుబెల్లాన్ని బాగా పీల్చుకున్నాక ఒక చెంచా బియ్యప్పిండిమరింత  
కారం వేసి ముక్కల్నికలియబెట్టింది . బియ్యప్పిండి వేయటం వలన దుంపలు ఒకదానికొకటి  
అతుక్కోకుండావిడివిడిగా వున్నాయిమూత పెట్టి కొంచెంసేపయ్యాక స్టవ్ ఆపేసింది

పట్టాభి కోసం పెట్టిన దుంపల్ని నాన్స్టిక్ పాన్ లోనే కొంచెం నూనె వేసి వేయిచిందిపిల్లాడికే కాబట్టి  
వర్రగా చెయనక్కర్లెదుఎర్రగా మాత్రంవేయిచిందిఉప్పుపసుపుజీలకర్రఒక రవ్వ కారం వేసి 
కలియబెట్టి స్టవ్ ఆపేసిందిరెండు కూరలు తయారయ్యాయి

రాత్రి భోజనాల వేళ అవుతుండగా విశ్వనాధం ఆఫీసు నుండి వచ్చాడు. వస్తూనే ఇవాళ ఐనా వేపుడు
చేశావా అని అడగ బోయి వేపుడువాసన వచ్చేసరికి మిన్నకున్నాడుకామాక్షి కంచాలు పెట్టి 
విశ్వనాధంపట్టాభిని భోజనానికి పిలిచిందిపట్టాభి కంచంలో వేపుడు కూర వేసి అన్నం పెట్టి  కలిపి 
ఇచ్చిందివిశ్వనాధానికి ఒకళ్ళు వడ్డిస్తే మహా చెడ్డ చిరాకుతనకి కావలసింది తనే వడ్డించుకుని 
తింటాడుతనకి నచ్చితే పప్పైనకూరైన రెండు,మూడు సార్లు తింటాడురెండో ఐటెం జోలికి వెళ్ళడు.
అందుకని కామాక్షి ఎపుడు విశ్వనాధానికి  వడ్డించదుపదార్ధాల మీద మూత తీసి అతనికి  అందుబాటులో పెడుతుంది

వేపుడు అంతా  పట్టాభికి  వేయటం చూసి "ఇదేమిటివేపుడు వాడికి ఒక్కడికేనా?నాకు  
చేయలేదా?"అసహనంగా అన్నాడు. “లేదురోజు వేపుళ్ళు ఐపొతున్నాయని పులుసు- బెల్లం పెట్టి  
మీ అమ్మగారు చేసినట్లు చేసేనుబాగా వచ్చింది. తినండిఅంది కామాక్షి నెమ్మదిగా
విశ్వనాధానికిఒళ్ళు మండిపొయింది. "వేపుడు ఐతే దగ్గరుండి వేయించాలనినీ టీవీ సీరియళ్ళకి  
అడ్డం వస్తుందనిఏదో కొంచెం పోపుపడేసిధనాధనా కుమ్మేసిపాసం పాసం చేసి తద్దినం కూర
లాగా తగలేట్టావా?  కోపం తారాస్థాయికి చేరుకుంది విశ్వనాధానికి

కామాక్షి మారుమాటాడకుండా కూర మూత  తీసి కంచం దగ్గర పెట్టిందికూర ఎర్రగాముక్కకి  
ముక్కలాగ వుండిపచ్చని కరివేపాకురెబ్బలతోటికమ్మని పోపు వాసనతో ఘుమ ఘుమ లాడేసరికి,
విశ్వనాధానికిపూనకం దిగి మామూలు మనిషి అయ్యేడుఆకలినకనకలాడటంతోవడ్డించుకోవడం 
ప్రారంభించేడుఅలవాటుప్రకారం మొదట కూరతోనే మొదలెట్టేడువిశ్వనాధానికి కూర నచ్చింది. 
కాని పైకి ఏమి అనకుండా రెండోసారి మళ్ళీ వేసుకున్నాడుతింటూ పట్టభితో "నువ్వు కూడా పులుసు,
బెల్లం కూర కొంచెం  టేస్ట్ చెయ్యరా "  అన్నాడు

విశ్వనాధానికి కూర నచ్చిందని కామాక్షికిఅర్ధమైపోయిందిఅంతవరకూ మౌనంగా వున్నది ఇంక  
అందుకుంది."చేమదుంపలు అంటేఎపుడు ఇంత నూనె పోసి బడ బడ వేయించడం ఒక్కటే కాదు 
పులుసుబెల్లం పెట్టుకోవచ్చునిమ్మకాయ పిండి చేసుకోవచ్చు,పులుసుల్లోనూ వేసుకోవచ్చు” 
అంది దెప్పి పొడుపుగ
కామాక్షి తనని దెప్పి పొడుస్తోందని గ్రహించి విశ్వనాధం "అయినా రాత్రి పూట చేమ దుంపలు వేపుడు
ఐతే అరుగుతుంది గానిఇలాపులుసులుబెల్లాలు పెట్టి చేస్తే అరగవుతనూ దెప్పేడువెంటనే  
కామాక్షి "మనసు పెట్టి చేసిమెత్తగా వుడికించేను కదారాత్రి పూటైనా అరుగుతుంది లెండిఅంది  
తడుముకోకుండ
తన మాట తనకే అప్పజెప్పిందనిమూడోసారి కూర వేసుకుంటూ కామాక్షి కేసి గుర్రుగా చూసాడు 
విశ్వనాధం శుభం! 




 

Saturday, December 20, 2014

కామాక్షి వంటింటి కబుర్లు: ‘చేమ దుంపోపాఖ్యనం!’





ముందుమాట:
అన్నట్లు చెప్పటం మరిచా! మొన్న రైతు బజారు లో కూరలు కొంటున్నప్పుడు “అబ్బీ ! చేమదుంపలు కిలో ఎంతకిస్తున్నావు?” అన్న సుపరిచితమైన గొంతు వినేసరికి పక్కకి తిరిగి చూసాను. ఎవరో కాదండి మన అందరికి బాగా తెలిసిన మన కామాక్షి!  కుశల ప్రశ్నలు అయ్యాక “చేమ దుంపల కొన్నారు, వేపుడు ప్రస్తావన ఏమైనా ఉందా?” అని కొంచెం కుతూహలం తో అడిగాను. దానికి మన కామాక్షి ఉత్కంట భరితమైన ప్రహసనం చెప్పింది. మరి మన పాఠకులకు కూడా అందిస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో మీ ముందుకు తెస్తున్నాము. విశ్వనాధానికి- అదేనండి మన కామాక్షి పతి దేవులు; వారు చేమదుంపల  వేపుడు అంటే చెవి కోసుకుంటారుట. మరి చూద్దాం!

రమణ బంధకవి

సంపాదకుడు




చామదుంపలు  - శ్రీ వారు

శ్రీమతి రత్నాశ్రీనివాస్

         
"కాస్త  రోజైన వచ్చే సరికి కొంచెం చామ దుంపల వేపుడు వర్రగావేడి వేడి గా చేసి పెట్టు. మొన్న అనంగా తెచ్చి పడేసానుఇదిగోచేస్తానుఅదిగో చేస్తాను అనటమే గాని దానికి మోక్షమే లేదుఅన్నాడు విశ్వనాథం ఆఫీసు కి వెళ్ళటానికి సిద్దమవుతూ

"ఎందుకు చేయనురాత్రి పూట చేస్తే అరగదనిశని,ఆదివారాలైతే ఇంట్లోనే వుంటారు కదాపగలు చేయచ్చని ఊరుకున్నానుఅంతేకాని బద్దకించి కాదు”,  కొంచెం వుడుకుమోత్తనంగా అంది కామాక్షి

"అప్పటి దాక ఆగితే మొక్కలు కూడా మొలుస్తాయి వాటికిఏదో చేసి పడేస్తే పనైపోతుందని!  సరిగ్గా వుడకనీకుండా  రాళ్ళల్లా చేస్తేఅరగవు కాని  మనసు పెట్టి చేసి మెత్తగా ఉడికిస్తే   సుబ్బరంగా అరుగుతాయి  పూట చేసిన!కొంచెం నిష్టూరంగా అంటూ కారుతాళాలు  తీసుకుని భయ్యి మంటూ వెళ్ళిపోయాడు విశ్వనాధం

ఎటు వాళ్ళు అటు వెళ్ళాక కామాక్షి ఇల్లు సర్దుకునిబట్టలు పని చూసుకునిస్నానం చేసిపూజ చేసుకుని అపుడు టిఫిన్ తింటుంది.తనకి వంట చెసుకొదురాత్రి చేసినవే సాధారణంగా మిగులుతాయి.అవే భోజనం వేళలో వేడి చేసుకుని తింటుందిపిల్లాడు పట్టాభికిమాత్రం బాక్స్ లోకి వాడు ఏది అడిగితెఅది చేసి పెడుతుందివిశ్వనాథం టిఫిన్ మాత్రం తిని వెళతాడు. మధ్యాహ్నానికి అక్కడే కాంటీన్లో తింటాడుఇక ఇంట్లో భోజనం రాత్రికేఅందుకే   ఒక్క పూట తనకి కావలసిన విధంగా వంట చేయమంటాడు విశ్వనాధం


అసలు విషయానికి వస్తే, కామాక్షికి వేపుడు చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు ముందురోజే   ఇంత  నూనె పోసి  బంగాళ   దుంపవేపుడుఅంతకు ముందు రోజు అరటికాయ వేపుడు చెసిన్ది పూట చేమ దుంపల వేపుడు చేయాలిటఇంట్లో వేపుళ్ళుకాంటీన్లో పకోడీలు,  పచ్చి మిరపకాయ  బజ్జీలుఅక్కడ ఆపేదెవరుఇలా రోజు వేపుళ్ళు చేసుకుపోతే ఆరోగ్యం  ఏమి గానుకొంచెం ఒంటి మీద శ్రద్ద ఉండక్కర్లేదుఇవాళ ఏమైనా గాని నేను మాత్రం ససేమిరా వేపుడు చేయనుకొంచెం గట్టిగానే నిశ్చయించుకుంది కామాక్షి...  (సశేషం) 









‘ఇంగువ కట్టిన గుడ్డ’


ముందు మాట:

పాఠకులకు నమస్కారం!  కొన్నిఅనివార్య  కారణాల వలన తెలుగు భోజనం పోస్ట్స్ ఆలస్యం 

అయ్యాయి. అందుకు  చింతిస్తున్నాము. ఘాటైన  ఇంగువ పోపు తగిలించిన  పుల్లటి తెలిగింటి 

పులిహోర లాంటి ‘తెలుగు భోజనం’  మరల మీ ముందుకు వచ్చింది. ఇంగువ కట్టిన గుడ్డ 

ఎంతకాలమైన ఆ సువాసనలను వెదజల్లుతుంది. మరి అ కధా కమామిషు ఏమిటో శ్రీమతి పద్మ 

గారు చెపుతున్నారు విందామా?


రమణ బంధకవి


సంపాదకుడు




ఇంగువ కట్టిన గుడ్డ


శ్రీమతి పద్మా రఘునాద్


పూర్వపు రోజుల్లో అంటే ఇంగువ డబ్బాలలో దొరకని రోజుల్లో అన్నమాట, ముద్ద ఇంగువని ఒక గుడ్డలో గట్టిగా కట్టుకుని దానిని వంట ఇంట్లో పోపుల డబ్బా లో భద్రపరచుకుని  వంట చేసేటపుడు వాడతారని  మా బామ్మ గారు చెప్పగా విన్నాను. 

ఇలా గుడ్డలో కట్టి ఉంచటం  వలన దాని వాసన పోకుండగా ఎంత కాలమయినా అది గుభాలింపు సువాసనలు అందిస్తూనే ఉంటుందట. అంతే కాకుండగా ఆ  ఘుభాళింపులు ఆ కట్టిన గుడ్డకి కూడా అలా అంటి పెట్టుకునే ఉంటాయి ఎంత కాలమయినా కూడా!

ఇంగువ వాసన గిట్టని వారు, ఇంగువని వంటల్లో వాడని తెలుగు వారు అసలు ఉండనే ఉండరని గట్టిగా చెప్పఛు. ఎందుకంటే తెలుగు వంటకాలలో- మన కూరలు, పచ్చళ్ళు,  పప్పులుపులుసులు, చారులలో తప్పని సరిగా వాడేది,  పాత్ర మూత తీయగానే ఘుప్పుమని సువాసనలు వెదజల్లేది  మన ఇంగువే  సుమా! ఇంగువకి అంత ఘాటైన సువాసన ఉంటుందని అది మన తెలుగు వారి వంటలకి కలికి తురాయి అని వేరే చెప్పక్కర్లేదు.

ఇక చింతపండు పులిహార అయినా, నిమ్మ కాయ పులిహార అయినా,  కొబ్బరన్నం కాని ఇంగువ పోపు దట్టంగా పడక పోతే దాని రుచి తగ్గిపోయినట్లే సుమండీ!

మన పత్యపు  పచ్చళ్ళ కోవలోకి  వచ్చే పాత చింతకాయ పచ్చడి కాని, ఉసిరి పచ్చ్హడి  లో కాని ఈ ఇంగువ పోపు పెట్టుకుంటే అవన్నీ మళ్లి  కొత్తగా తింటున్నట్లు అనిపించి జిహ్వ లేచి వస్తుంది మరి. 

జలుబు జ్వరాన పడి లేచిన తర్వాత, కాస్త ఇంగువ చారు పోసుకుంటే ప్రాణం లేచివస్తుందని వేరే చెప్పక్కర్లేదు కూడాను. 

ఇంతే కాకుండగా ముందుగా చేసుకున్న వంటపదార్ధాల మీద కూడా తినేముందు  కొంచెం ఇంగువ పోపు పెట్టుకుంటే, అప్పటి కప్పుడు తయారు చేసుకుని తింటున్న అనుభూతి నివ్వగలిగేది  కూడా మన ఇంగువే అనటం లో ఏ  మాత్రం సందేహం లేదు. 

ఇలా ప్రతీ వంటకానికి తుది మెరుగులు దిద్దేదీ , "పాత తనానికి" కొత్త రుచి నిచ్చేది మన ఇంగువ పొపే  అన్నది నూటికి నూరు పాళ్ళ ( నోటికి నోరు పాళ్ళ )  నిజం!

ఈ ఇంగువ కి ఒక్క రుచి కరమైన ఘాటైన సువాసనే కాకుండగా కడుపు ఉబ్బరం తగ్గించే గుణం కూడా ఉన్నదని అందుకనే మన వంటల్లో విరివిగా వాడే అలవాటు పూర్వపు రోజులనుండే ఉన్నదని చాల మంది  పెద్దవారు కూడాచెప్తుంటారు. 

ఇక ఈ ఇంగువ కట్టిన గుడ్డని పరిశీలిస్తే , ఇందాక చెప్పుకున్నట్లు, ఇంగువ మొత్తం అయిపోయినా, ఆ ఇంగువ వాసన ఆ గుడ్డని అలానే ఎంత కాలమయినా అంటిపెట్టుకుని ఉంటుందని తెలుస్తోంది. మనకి సాధారణంగా అనేక స్వభావాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కాని , స్నేహాలు కాని ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది స్వభావం మనల్ని చాల ప్రభావితం చేస్తుంది వారు మన సమీపంలో ఉన్నా  లేకపోయినా కూడా! అయితే ఏ యే స్వభావాలు మనలని ఎంత వరకు ప్రభావితం చేస్తాయి అన్న విషయం మన వివేకం మీద, మన సంస్కారాల మీద తద్వారా సంక్రమించే  మన స్నేహాల మీద ఆధారపడి ఉంటాయి. 


మరొక్క మాట!  మన  భారత దేశం లోని ఎందఱో గొప్ప మహానుభావులు వారి విశిష్టమైన వ్యక్తిత్వం తో ఎక్కడి కెళ్ళినా వారి స్వభావపు పరిమళాలు వెదజల్లారు.  వారి మాటలతో, చేష్టలతో ప్రజలకు  గొప్ప గొప్ప  సంస్కారాలనుస్పూర్తిని  అందజేశారు. వారి ఉన్నతమైన ఆదర్శాలనే ఘాటైన ఇంగువతో గట్టిగ్గా కట్టిన  గుడ్డ మన భారతదేశం అని నిస్సందేహంగా అనుకోవచ్చు. ఆ మహాత్ములు నిష్క్రమించినా వారి సంస్కారాలు, ఆదర్శాలు  మన దేశం లో ఇంకా సువాసనలు గుప్పిస్తునే ఉన్నాయి.  మరి ఆ సువాసన ఘాటు  పోకుండగా మన ఇంగువ కట్టిన గుడ్డని మరింత పదిలంగా చూసుకుందామా