Monday, December 22, 2014

కామాక్షి వంటింటి కబుర్లు: ‘చేమ దుంపోపాఖ్యనం!’ ముగింపు!


ముందుమాట: 
కామాక్షి వాలకం చూస్తే, చేమ దుంపల వేపుడుకి ఎదో ఉపద్రవం  మరియు విశ్వనాధానికి ఎదో తీవ్ర ఆశాభంగం కలిగేలాగా కనబడుతోంది. సమయం సాయంత్రం అవుతోంది ; విశ్వనాధం ఇహనో ఇప్పుడో రావచ్చు; మరి మూకుట్లో పెను తుఫాను వచ్చేలోగా మనం కాస్త తప్పుకుని జరిగేదో దూరంనుంచే చూడటం శ్రేయస్కరం!

రమణ బంధకవి

సంపాదకుడు


చామదుంపలు  - శ్రీ వారు – ఇంటర్వెల్ తరువాత!

శ్రీమతి రత్నాశ్రీనివాస్

....బుట్టలోంచి చామదుంపలు తీసి పంపు కింద పెట్టి సుబ్బరంగా మట్టిపోయేలాగా  ఒకటికి రెండు సార్లు కడిగిందిప్రెషర్ పాన్ తీసి,చామ  దుంపలు పెట్టిసరిపడా నీళ్ళు పోసి 
కొంచెం పసుపు వేసి మూత పెట్టిందిమూడు కూతలు వచ్చాక స్టవ్ ఆపి,చల్లారాక దుంపలు బైటకి  
తీసింది. భర్తఆరోగ్యం కోసం మనసు పెట్టి చేసిందేమో దుంపలు మెత్తగా వుడికాయితొక్క తీసి,నాన్ స్టిక్ మూకుడిని స్టవ్ వెలిగించి పెట్టింది. 

మామూలు బాండి ఐతే పోపు కూర కదాకలిపినపుడు ముద్ద ఐతే విశ్వనాథం గొడవ చేస్తాడు.
కొంచెం నూనె వేసి ఎండు మిరపకాయలు రెండు,మూడు తుంపి వేసిన్దితలా కొంచెం మినప పప్పు,
ఆవాలుజీలకర్ర వేసి పోపుచిటపట లాడేక, కమ్మటి పాల ఇంగువ వేసింది.పచ్చగాతాజాగా  
వున్నకరివేపాకు రెబ్బలు వేసి పైన చేమదుంపలు వేసిన్ది.పిల్లాడు పట్టాభి పోపు కూర తినడు 
తిండి విషయంలో కొంచెం పేచికోరుపంతాలమారిఅందుకని కొన్ని దుంపలు వాడికి వేపుడు
చేయటం కోసమని అట్టే పెట్టిందిఉప్పు,పసుపు వేసి కొంచెం కలియబెట్టి మూత పెట్టిందిప్రక్కనే ఒక
చిన్నకప్పులో చింతపండు నానబెట్టిందిదుంపలు మగ్గేక కొద్దిగా చింతపండు పులుసు  వేసిచిన్నబెల్లం ముక్క కూడా వేసిన్దిదుంపలు చితకకుండా జాగ్రత్తగా ఓమారు కలిపి మూత పెట్టింది.
కొంతసేపటికి దుంపలు  పులుసుబెల్లాన్ని బాగా పీల్చుకున్నాక ఒక చెంచా బియ్యప్పిండిమరింత  
కారం వేసి ముక్కల్నికలియబెట్టింది . బియ్యప్పిండి వేయటం వలన దుంపలు ఒకదానికొకటి  
అతుక్కోకుండావిడివిడిగా వున్నాయిమూత పెట్టి కొంచెంసేపయ్యాక స్టవ్ ఆపేసింది

పట్టాభి కోసం పెట్టిన దుంపల్ని నాన్స్టిక్ పాన్ లోనే కొంచెం నూనె వేసి వేయిచిందిపిల్లాడికే కాబట్టి  
వర్రగా చెయనక్కర్లెదుఎర్రగా మాత్రంవేయిచిందిఉప్పుపసుపుజీలకర్రఒక రవ్వ కారం వేసి 
కలియబెట్టి స్టవ్ ఆపేసిందిరెండు కూరలు తయారయ్యాయి

రాత్రి భోజనాల వేళ అవుతుండగా విశ్వనాధం ఆఫీసు నుండి వచ్చాడు. వస్తూనే ఇవాళ ఐనా వేపుడు
చేశావా అని అడగ బోయి వేపుడువాసన వచ్చేసరికి మిన్నకున్నాడుకామాక్షి కంచాలు పెట్టి 
విశ్వనాధంపట్టాభిని భోజనానికి పిలిచిందిపట్టాభి కంచంలో వేపుడు కూర వేసి అన్నం పెట్టి  కలిపి 
ఇచ్చిందివిశ్వనాధానికి ఒకళ్ళు వడ్డిస్తే మహా చెడ్డ చిరాకుతనకి కావలసింది తనే వడ్డించుకుని 
తింటాడుతనకి నచ్చితే పప్పైనకూరైన రెండు,మూడు సార్లు తింటాడురెండో ఐటెం జోలికి వెళ్ళడు.
అందుకని కామాక్షి ఎపుడు విశ్వనాధానికి  వడ్డించదుపదార్ధాల మీద మూత తీసి అతనికి  అందుబాటులో పెడుతుంది

వేపుడు అంతా  పట్టాభికి  వేయటం చూసి "ఇదేమిటివేపుడు వాడికి ఒక్కడికేనా?నాకు  
చేయలేదా?"అసహనంగా అన్నాడు. “లేదురోజు వేపుళ్ళు ఐపొతున్నాయని పులుసు- బెల్లం పెట్టి  
మీ అమ్మగారు చేసినట్లు చేసేనుబాగా వచ్చింది. తినండిఅంది కామాక్షి నెమ్మదిగా
విశ్వనాధానికిఒళ్ళు మండిపొయింది. "వేపుడు ఐతే దగ్గరుండి వేయించాలనినీ టీవీ సీరియళ్ళకి  
అడ్డం వస్తుందనిఏదో కొంచెం పోపుపడేసిధనాధనా కుమ్మేసిపాసం పాసం చేసి తద్దినం కూర
లాగా తగలేట్టావా?  కోపం తారాస్థాయికి చేరుకుంది విశ్వనాధానికి

కామాక్షి మారుమాటాడకుండా కూర మూత  తీసి కంచం దగ్గర పెట్టిందికూర ఎర్రగాముక్కకి  
ముక్కలాగ వుండిపచ్చని కరివేపాకురెబ్బలతోటికమ్మని పోపు వాసనతో ఘుమ ఘుమ లాడేసరికి,
విశ్వనాధానికిపూనకం దిగి మామూలు మనిషి అయ్యేడుఆకలినకనకలాడటంతోవడ్డించుకోవడం 
ప్రారంభించేడుఅలవాటుప్రకారం మొదట కూరతోనే మొదలెట్టేడువిశ్వనాధానికి కూర నచ్చింది. 
కాని పైకి ఏమి అనకుండా రెండోసారి మళ్ళీ వేసుకున్నాడుతింటూ పట్టభితో "నువ్వు కూడా పులుసు,
బెల్లం కూర కొంచెం  టేస్ట్ చెయ్యరా "  అన్నాడు

విశ్వనాధానికి కూర నచ్చిందని కామాక్షికిఅర్ధమైపోయిందిఅంతవరకూ మౌనంగా వున్నది ఇంక  
అందుకుంది."చేమదుంపలు అంటేఎపుడు ఇంత నూనె పోసి బడ బడ వేయించడం ఒక్కటే కాదు 
పులుసుబెల్లం పెట్టుకోవచ్చునిమ్మకాయ పిండి చేసుకోవచ్చు,పులుసుల్లోనూ వేసుకోవచ్చు” 
అంది దెప్పి పొడుపుగ
కామాక్షి తనని దెప్పి పొడుస్తోందని గ్రహించి విశ్వనాధం "అయినా రాత్రి పూట చేమ దుంపలు వేపుడు
ఐతే అరుగుతుంది గానిఇలాపులుసులుబెల్లాలు పెట్టి చేస్తే అరగవుతనూ దెప్పేడువెంటనే  
కామాక్షి "మనసు పెట్టి చేసిమెత్తగా వుడికించేను కదారాత్రి పూటైనా అరుగుతుంది లెండిఅంది  
తడుముకోకుండ
తన మాట తనకే అప్పజెప్పిందనిమూడోసారి కూర వేసుకుంటూ కామాక్షి కేసి గుర్రుగా చూసాడు 
విశ్వనాధం శుభం! 




 

No comments:

Post a Comment