శ్రీమతి రత్నా శ్రీనివాస్
బంగాళా
దుంపను ఎందులో కలిపినా రుచిగా వుంటుంది. అది గోరుచిక్కుడు కాని, గింజ చిక్కుడు కానీ, కాబేజీ కాని, ఇంచుమించుగా అన్నింటిలోను కలుస్తుంది.
మీరు కూడా ఒక సారి ప్రయత్నించి చూడండి.
కావలసిన వస్తువులు:
గోరుచిక్కుడు
కాయలు
250గ్రాములు
బంగాళా
దుంపలు
5
నూనె
1
టేబుల్ స్పూన్
ఎండు
మిర్చి
2
సెనగ
పప్పు
/2
టీస్పూన్
మినప
పప్పు
1/2 టీస్పూన్
ఆవాలు
1/4 టీస్పూన్
జీలకర్ర
1/4 టీస్పూన్
ఇంగువ
చిటికెడు
కరివేపాకు
3-4
రెబ్బలు
ఉప్పు
రుచికి సరిపడ
కారం
1/4th టీ స్పూన్
తయారు చేయు విధానం:
గోరుచిక్కుడును
శుబ్రముగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. మొదలు, ముచిక తీసెయ్యాలి. మొదలు తీసేటప్పుడు పీచు
కూడా తీసేయ్యాలి. అలాగే ముచిక భాగం తీసేటప్పుడు దానికున్న పీచు కూడా తీసేసుకోవాలి.
చిక్కుడుని
మూడు లేదా నాలుగు ముక్కలుగా చేతితో విరుచుకోవాలి. ముక్కలు కొంచెం పొడుగ్గా వుంటే
బాగుంటుంది. బంగాళదుంపలని బాగుగా రుద్ది కడగాలి. వాటి చెక్కు తీసి నాలుగు భాగాలుగా
తరుక్కోవాలి.
ప్రెషర్
పాన్ తీసుకుని అందులో రెండు కాయగూరలు తీసుకుని సుమారుగా 80-100ml
వరకు నీళ్ళు పోసి, చిటికెడు పసుపు వేసి స్టవ్ పైన పెట్టాలి.
మొదట కూత వచ్చిన
తరువాత 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. రెండవ విజిల్ కి
ఆపుకొవాలి. ప్రెషర్ రిలీజ్ అయ్యేక కూర ముక్కలు బైటకి తీసి నీరు
ఏదైనా వుంటే తీసేసుకోవాలి.
ఇపుడు
బాండి లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగేక సెనగ పప్పు, మినప పప్పు వేసుకుని వేయించుకోవాలి. రంగు మారేక
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. చివర్లో ఇంగువ, కరివేపాకు
వేసి, కూర ముక్కలని అందులో వేసి పోపు కలిసేలాగా కలపాలి. ఉప్పు సరిపడా వేసి మూత పెట్టాలి.ఇదు నిమిషాల వరకు మగ్గించి ఇపుడు
పొడి కారం వేసి ఒక సారి కలియబెట్టి ఒకటి, రెండు నిమిషాలు వుంచి స్టవ్ ఆపుకోవాలి. కూరను ఒక
శుబ్రమైన గిన్నెలోకి తీసుకోవాలి.
ఇది
వేడి వేడి అన్నంతో తింటే చాల రుచిగా వుంటుంది. అలాగే చపాతీలు,
పరాటాలతో కూడా తినవచ్చు.
No comments:
Post a Comment