ముందుమాట:
మనం దంపతులుగా
పూజలకు కూర్చున్నపుడు కాని, పెద్దలు ఎవరి వద్దనైన ఆశీర్వాదం
తీసుకుంటున్నపుడు
కానీ, భర్తకు ఎడమ వైపుగా భార్యను కూర్చోమని లేదా నిలబడమని
పురోహితులు లేదా పెద్దలు
చెపుతారు. దీనికి ఒక పరమార్ధం ఉందని, అర్తనారీశ్వర తత్వానికి
సంకేతమని మనకు వివరిస్తున్నారు శ్రీమతి జోస్యుల ఉమాధర్.
రమణ బంధకవి
సంపాదకుడు
అర్థ నారీశ్వరం
శ్రీమతి జోస్యుల ఉమాధర్
దేవేవేరులంతా
స్వామివారి విగ్రహాలకి ఎడమ ప్రక్కనే ఎందుకు వుంటారు?
ఆగమశాస్త్రం
వ్యక్తి శరీరాన్ని నిలువుగా రెండు భాగాలూ గాను, అడ్డంగా రెండు భాగాలు గానూ
విభజించింది. నాభి నుండి ఫై భాగాన్ని పవిత్రమని, నాభి క్రిందభాగాన్ని అపవిత్రం అని
అంటారు. దానికి గుర్తుగా నాభి పై భాగానికి బంగారు ఆభరణాలూ, నాభి క్రింది భాగానికి
అందెలు, నూపురాలు, మట్టెలు, మొదలైన వెండి ఆభరణాలు ధరించటం శాస్త్ర సమ్మతమని
తెల్పింది. నాభి నుండి క్రింది భాగాన్ని అపవిత్రం అనే దానికి గుర్తుగా మొలత్రాడు,
మొలనూలు వంటివి కూడా ఏర్పటు చేసింది శాస్త్రం.
వ్యక్తి
శరీరాన్ని నిలువుగా రెండు భాగాలుగా విభజన చేస్తే ఒక వైపును కుడి లేదా సవ్య లేదా
దక్షిణ భాగమనీ, రెండవ వైపును ఎడమ లేదా అపసవ్య లేదా వామ భాగమనీ అంటారు. కుడి
భాగాన్ని శివుడికి సంకేతం గాను, ఎడమ భాగాన్ని శక్తికి సంకేతం గాను ఏర్పాటు చేసింది.
ఈ రెండింటి సంగమమే సంపూర్ణ శరీరమనీ, రెండూ లేనిదే వ్యక్తే లేడనీ చెప్పింది.
అర్థనారీశ్వర తత్త్వం అంటే ఇదే. ఒక వైపు నుండి ఆలోచన రాగానే మరో ప్రక్క నుండి
ఆచరణకి ఉత్సాహము కలిగినపుడే ఏ వ్యక్తి ఆయినా కార్యాన్ని చేయగలుగుతాడు. ఎడమ భాగం
స్త్రీ భాగం కాబట్టీ శక్తి భాగం కాబట్టి దేవేరులని ఎడమవైపు ఉంచుతారు. దంపతులు కూడా
అలానే ఉండాలి. ఆశీర్వచనానికి కూడా అలానే
వుండాలి. ‘ఒక పెడ వెనక్కి లాగుతుంటే పని ముందుకెలా పోతుంది?’ అనే నానుడిలో
భావం ఇదే. ఇద్దరూ కలసి చేయాల్సిన పనిలో
ఒకరు వెనక్కి లాగుతుంటే పని ఎలా జరుగుతుంది అని అర్థం.
No comments:
Post a Comment