ముందుమాట:
పట్టాభి లాంటి పిల్లల మనసు రంజించే ఉపాహారాలను మీ ముందుకు
తెస్తామని ఇదివరలో చెప్పుకున్నాం. మీ పిల్లలంతా ఇంకా ‘ఇడ్లీపిజ్జా’ రుచి మరచి
ఉండరు. అలాంటి మరియొక ఆకర్షనీయమైన ఉపాహారం ‘ఉప్మారోని’ ని మీ ముందుకు
తెస్తున్నారు శ్రీమతి రత్నా శ్రీనివాస్. ఇది ఇటలీ సాంప్రదాయానికి చెందిన ‘మేకరోనీ’
అనీ వంటకాన్ని మన సాంప్రదాయపు ఉప్మాతో కలిపి చేసిన రుచికరమైన ఉపాహారం. మీరు కూడా
మీ పిల్లలకు చేసే పెట్టండే!
రమణ బంధకవి
సంపాదకుడు
‘ఉప్మారోని’
శ్రీమతి రత్నా శ్రీనివాస్
పట్టాభి
వేసవి సెలవుల్లో సమ్మర్ కాంప్ కి వెళుతుంటాడు. ఉదయం 8
గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు సమ్మర్
కాంప్ లో రకరకాల కార్యక్రమాలు
వుంటాయి. తోచలేదనే పేచి వుండదు.
"పట్టు గాడు వచ్చే
వేళ ఐనట్లుందే!” బాల్కనీ లో కూర్చుని మజ్జిగ చిలుకుతూ అన్నారు సూరిడమ్మగారు.
పట్టాభి
రానే వచ్చాడు. వస్తూనే "మమ్మీ! మాకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. అందరికి ఒకొక్క
టాపిక్ ఇచ్చేరు. నాకు ‘Indianising
Italian cuisine’ ఇచ్చేరు"
ఎంతో ఉత్సాహంతో చెప్పేడు.
"అంటే ఏమిట్రా?" అంతే ఉత్సకతో అడిగేరు సూరిడమ్మ గారు .
"మామ్మా! నేను ఇటలీ
డిష్ ని ఇండియన్ స్టైల్ లో చేసి తీసుకెళ్ళాలి" వివరించాడు .
అప్పటివరకు
టీవీ చూస్తున్న లక్ష్మీ కాంతం గారు వాల్యూం తగ్గించి వారి సంభాషణ వినటానికి
ప్రయత్నించారు. ఆయనకి ఇటలీ లో 'ఇ', డిష్ లో 'డి' తప్ప తతిమ్మ సంభాషణ ఏది చెవి
కెక్కలేదు.
"ఏమిటి పట్టు! ఇడ్లీ
తింటావా? ఏ? ఇంట్లో పిండి లేదా?
ఇద్దరి ఆడవాళ్ళని అడిగేరు అమాయకంగా .
పట్టాభికి
నవ్వాగలేదు. కామాక్షి చెప్పబోతున్నంతలో పట్టాభి నవ్వుతూ "ఇడ్లీ కాదు
తాతా! నేను ఇటలీ డిష్ ని ఇండియన్ మెథడ్ లో చేయాలి. మిగతా వాళ్లకి వేరే కంట్రీస్ వి ఇచ్చేరు. అందరం
అన్ని షేర్ చేసుకుని తింటాము" ఇంకా విడమర్చి చెప్పేడు.
"ఓ! అలాగా ! ఇటలీ
డిష్ అంటే ఏమి చేస్తావు?”
"నేను చేయలేను కదా!
మమ్మీ చేస్తుంది" అమాయకంగా అన్నాడు.
“ఈ ప్రాజెక్టులు అవీ పిల్లలకు కాదు. పిల్లల తల్లులకే.
ఏమిటో ఈ చదువులు!” అర్ధం కానట్లు అన్నారు అత్తగారు.
కాదత్తయ్య!
పిల్లలందరూ తెచ్చినవి అందరిని పంచుకుని తినమంటారు. అందువల్ల వాళ్లకి ఒకరితో
పంచుకునే గుణం అలవడుతుంది, అంది కామాక్షి.
“ఏమోనే! ఇటలీ దేశం ది చేయాలిట. ఏమి
చేస్తావో? ఎలా చేస్తావో?”
కామాక్షి
అడిగింది "పట్టూ! Italian
Cuisine లో ఏముంటాయి
చెప్పు?"
"నాకు పీజ, పాస్తానే తెలుసు" అన్నాడు.
"కిందటి సారి ఇడ్లి పిండి తో పిజ్జా చేసేము కదా! కనుక ఇపుడు పాస్తాతోనే
ఏమైనా చేయాలి. సరేలే నువ్వు బట్టలు మార్చుకుని రా. అన్నం తిందువు గాని" అంది కామాక్షి. పట్టాభి బట్టలు
మార్చుకోవటానికి వెళ్ళేడు.
భోజనాలకి
కూర్చున్నారు. "మమ్మీ ! ఆలోచించేవా ! ఏమి చేస్తావు?
అడిగేడు పట్టాభి.
ఇండియన్
స్టైల్ లో చేయాలి అంటే మన సంప్రదాయం వుండాలి. ఉప్మా చేద్దాం. సరేనా?” అంది
“ఛీ! పాస్తతో ఉప్మానా?”
“నేను బాగా చేస్తానుగా! స్కూల్ లో అంతా మెచ్చుకుంటారు చూడు” అంది కామాక్షి.
"మమ్మీ! ఐతే రేపు నువ్వు లేచినపుడు నన్ను కూడా లేపు. నువ్వు
చేస్తుంటే నేను చూసి నేర్చుకుని క్యాంపు లో ఎక్ష్ ప్లైన్
చేస్తాను" అన్నాడు
పట్టాభి.
మరునాడు
ఆరు గంటలకల్లా పట్టాభిని లేపింది. మొహం కడుక్కుని వస్తే ఉప్మా చేద్దామని
చెప్పిన్ది. పట్టాభి మొహం కడుక్కుని, బుక్,
పెన్ తెచ్చుకుని వచ్చాడు .
కామాక్షి
మేకరోని తో చేద్దామా అంది. సరే అన్నాడు పట్టాభి. ప్యాకెట్ కట్ చేసి 100
గ్రాముల ఒక బౌల్లో పోసింది. సుమారు 500గ్రాములు నీళ్ళు
కొలిచి గిన్నెలో పోసి మరిగించింది. పట్టాభి జాగ్రతగా గమనిస్తూ పుస్తకం లో
రాసుకుంటున్నాడు. నీళ్ళు మరిగేక మేకరోని వేసి కలిపింది.
"ఇది కుక్
అవ్వటానికి ఎంత సేపు పడుతుంది మమ్మీ?”
" సుమారు 15 నిమిషాలు. ఈలోగా నువ్వు
పాలు తాగు" అని పాలు ఇచ్చింది .
పట్టాభి
పాలు తాగుతుంటే ఉప్మా పోపు కి సామాను తీసుకుంది. బాండి పెట్టి ఒక టేబుల్
స్పూన్ నూనె వేసింది. సెనగ పప్పు, మినప పప్పు వేసి వేయించింది. ఆవాలు
వేస్తుంటే పట్టాభి ఉత్సాహంగా దగ్గరకి వచ్చి నుంచుంటే ఆవాలు పేలుతాయి దూరంగా నుంచోమంది.
అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆపేసింది. మేకరోని కుక్ అయిందేమో చూస్తా నన్నాడు
పట్టాభి. కామాక్షి గరిటెతో తీసి నొక్కి చూడు అంది. పట్టాభి నొక్కి చూసి నోట్లో
వేసుకున్నాడు. ఇంకా కొంచెం సాఫ్ట్ గా అవ్వాలి అన్నాడు.
“అయితే నువ్వు
ఈ లోగా స్నానం చేసేయి" అంది కామాక్షి
.
"నా స్నానం
అయ్యేంతవరకు వెయిట్ చేయి. నువ్వు చేసేయకు" అన్నాడు. సరేనని వాడికి బట్టలు ఇచ్చింది.
పట్టాభి
స్నానం చేసి వచ్చేలోపు ఉడికి పోయింది. పట్టాభి కూడా బట్టలు వేసుకుని రెడీ ఐపోయాడు.
ఒక
చిల్లుల పళ్ళెం తీసుకుని ఉడికిన మేకరోని వేసి నీళ్ళు వార్చేసింది. ఇపుడు పోపు వున్న పాన్ లో మేకరోని వేసి
కలిపింది. పట్టాభి నేను కలుపుతానని కలిపేడు. వాడికి
ఒక మైక్రోవేవ్ బౌల్ ఇచ్చి మేకరోని ఉప్మా అందులో పెట్టింది. ఇంకొక చిన్న బాక్స్ లో
నిమ్మకాయ చెక్క కూడా పెట్టి ఇచ్చింది.
మీ
స్కూల్ లో మైక్రోవేవ్ వుంది కదా! మీరు తినే ముందు 2
మినిట్స్ మైక్రోవేవ్ చేసి , నిమ్మకాయ పిండి ఈ గరిటెతో కలుపు అని ఒక
గరిటె ఇచ్చింది. పిల్లలకి పెట్టడానికి పేపర్ ప్లేటులు,
ప్లాస్టిక్ స్పూన్స్ అన్ని సర్ది ఒక బాగ్ లో పెట్టింది. మీ టీచర్
ఏమి తెచ్చావంటే "ఉప్మారొని" అని చెప్పు అంది. పట్టాభి చాల సంతోషించాడు.
అత్తగారు, మావ గారు వచ్చి చూసారు. “ చాల తొందరగా ఐపోయింది మామ్మ! మమ్మీ దీని
పేరు "ఉప్మారొని " అని పెట్టింది. మమ్మీ చేసిందంతా చూసి నేను బుక్ లో
రాసుకున్నాను" అని చూపించాడు .
"మా నాయనే! బాగా
చెప్పు నాన్నా”
అని అత్తగారు ముద్దు చేసేరు.
మావ గారు ప్లాస్టిక్
బాగ్ పట్టుకుని పట్టాభిని బస్సు ఎక్కించి వచ్చేరు.
మధ్యాహ్నం
పట్టాభి సమ్మర్ క్యాంపు నుండి వచ్చేడు. "మమ్మీ నేను బాగా ఎక్ష్ ప్లైన్
చేసెను. అందరు టేష్టి గా ఉందన్నారు. నువ్వు ఇచ్చిన ఉప్మా అంతా
ఐపోయింది" అని డబ్బా చూపించాడు. కామాక్షి "మరి నేను
చెప్పలేదు? అందరు బాగుంది అంటారని!” కొంచెం గర్వం, కొంచెం ఆనందంగాను అంది.
"బావుందిరా! అన్ని
దేశాల వాళ్ళ తిండిని మన సంప్రదాయం లో తిన్నారన్న మాట" ఆశ్చర్యపోతూ అన్నారు
సూరిడమ్మ గారు.
మరి మీరు కూడా అలోచించి మీ పిల్లలకు నచ్చే ఇటువంటి ఉపాహారాలు
చేసి పెట్టొచ్చు.
No comments:
Post a Comment