కొబ్బరి కారం
శ్రీమతి రత్నా శ్రీనివాస్
కొబ్బరి కారం పేరు సుపరిచితమే. అంటే ఎండు కొబ్బరి కారం.ఎప్పుడైనా మనం శ్రీ
సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్న,ఎవైన పూజలు, నోములలో ఎవరైనా ఎండు కొబ్బరి
చిప్పలు ఇస్తే,మనం వాటితో కొబ్బరి కారం చేసుకొని అవి సద్వినియోగం చేసుకొనవచ్చును.ఇపుడు
దాని తయారీ లోకి వెళ్లి చూద్దాము.
తయారు కావటానికి పట్టే సమయం
: అర్ధ గంట
కావలసిన పదార్ధాలు :
ఎండు కొబ్బరి చిప్పలు 8
(౩౦౦ గ్రాములు తురుము)
సెనగపప్పు 100
గ్రాములు
మినపపప్పు
100 గ్రాములు
ఎండుమిర్చి 50 గ్రాములు
జీలకర్ర
21/2 టేబుల్ స్పూన్స్
ధనియాలు
150 గ్రాములు
ఉప్పు
సరిపడా
నూనె
4 టేబుల్ స్పూన్స్
చింతపండు
30 గ్రాములు
తయారు చేయు విధానం:
ఒక బాణలి లో పైన చెప్పిన పాళ్ళల్లో నూనె తీసుకుని పైన
చెప్పిన పదార్ధాలన్నీ వేరు వేరుగా దోరగా వేయించుకుని చల్లారేక గ్రైండ్ చేసుకోవాలి.
తగినంత ఉప్పు కలిపి శుబ్రమైన పొడి సీసా లో భద్రపరచుకోవాలి.
సలహాలు :
1.కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని
మొదటి ముద్దలో తింటే అమోఘంగా వుంటుంది.
2. అలాగే ఇడ్లి,దోస,ఉప్మాలలో కూడా నంచుకోవటానికి
బాగుంటుంది.
3. కాకరకాయ కూరలోను,గుత్తి వంకాయలో
కూరటానికి,బీరకాయ,మొదలగు కూరల్లో కూడా కొబ్బరి కారం వేసి చేసుకుంటే బాగుంటుంది.
Nice recipes Ratna
ReplyDelete