శ్రీమతి రత్నా శ్రీనివాస్
కాప్సికం ను బుంగ మిర్చి అని, బెంగుళూరు
మిర్చి అని కూడా పిలుస్తారు.
కావలసిన పదార్దములు:
కాప్సికం :
3 పెద్దవి
ఉల్లిపాయలు: 2 పెద్దవి
జీలకర్ర: ½ టీస్పూన్
కారం: ½ టీస్పూన్
ఉప్పు: తగినంత
నూనె: 2 ½
టేబుల్ స్పూన్స్
తయారు చేయు విధానం:
కాప్సికం ని శుబ్రంగా కడిగి మొదలు తీసి గింజలు, మధ్యలో
వుండే తెల్ల భాగం తీసేసుకోవాలి.
ఇపుడు కాయలకి కొద్దిగా నూనె రాసి ఒక మైక్రోవేవ్
సేఫ్ బౌల్ లో నిలువుగా పెట్టి, మూత పెట్టి
రెండు నిమిషాలు మైక్రోవేవ్ చేయాలి.
అలాగే పడుకోబెట్టి రెండు నిమిషాలు, తిరగ తిప్పి రెండవ
వైపు పడుకోబెట్టి ఇంకొక
రెండు నిమిషాలు మైక్రోవేవ్ చేసుకోవాలి. మూత వుంచి అలాగే కొంత
సేపు ప్రక్కన
పెట్టుకుందాం.
ఇపుడు మైక్రోవేవ్ ఐన కాప్సికం లో ఈ ఉల్లిమసాలను ఒక స్పూన్
తో తీసి కూరుకోవాలి.
ఉల్లిమసాల కూరిన కాప్సికం లను తిరిగి మొదట మైక్రోవేవ్
చేసిన బౌల్ లోనే పెట్టుకుని, మూత
పెట్టి మూడు నిమిషాలు మైక్రోవేవ్ చేసుకోవాలి. ఇలా
చేయటం వలన కాప్సికం, ఉల్లిమసాలతో
కలిపి ఉడికినట్లు అవుతుంది.
ఇపుడు వేరొక బాణలి తీసుకుని టేబుల్ స్పూన్ నూనె వేసుకుని,
కాగేక మైక్రోవేవ్ ఐన కాప్సికం
లను వేసుకోవాలి. రెండు లేక మూడు నిమిషాలు అయ్యేక
వేగిందో లేదో చూసుకుని జాగ్రతగా
రెండవ వైపు మార్చుకోవాలి. కాప్సికం లను
తిప్పేటప్పుడు ఉల్లిమసాల బైట బాండీ లో
పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇదే పద్దతిలో
నాలుగు వైపులా వేగేటట్లు చూసుకోవాలి.
వేగిన కాప్సికంలను ఒక ప్లేట్ లోకి కాని బౌల్ లోకి
కాని తీసుకోండి.
వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా:
ఉల్లి మసాల కూరిన కాప్సికం కూర వేడి వేడి అన్నంలో
రుచిగా వుంటుంది.
దీనిని చపాతీ, పరాటాలతో కూడా
తినవచ్చును.
దీనిని పార్టీలలో చేసుకుంటే
వెరైటీ గా వుంటుంది.
ఇక్కడ కాప్సికం పెద్ద సైజు వి చూపించటం
జరిగింది. వీలయితే చిన్న సైజు కాయలతో
చేసుకుంటే
మంచిది. కాయ తొందరగా మగ్గుతుంది, సమానంగా వేగుతుంది కూడా. ఉల్లిమసాల
కూరటం
కూడా తేలిక అవుతుంది.
No comments:
Post a Comment