ముందుమాట:
ఈ సారి మీరు రైతు బజారు కు కానీ, కూరల మార్కెట్ కు కానీ
వెళ్ళినప్పుడు అక్కడ మీకు చిన్న క్యాబేజీ దుంపల లాంటి వాటి పైన ఒకటి రెండు కాడలు
తో కనిపిస్తే, అదేమీ కూర అని విస్తుపోకండి. దానిని నూల్ కోల్ అని అంటారు. నూల్
కోల్ బహుశా తెలుగు వారికి అంత సుపరచితమైన కాయగూర కాకపోవచ్చు. కాని దక్షిణాదిన చెన్నై, బెంగుళూరు లో విరివిగా
దొరుకుతుంది. మన వద్ద కూడా ఇప్పుడు దొరుకుతుంది. దీనిలో ఔషధ గుణాలు చాల మెండుగా ఉంటాయి.
విటమిన్స్, మినరల్స్ అధికశాతం లో వుంటాయి. ఎప్పుడూ ఈ వంకాయ, దొండకాయ, బెండకాయేనా అని
విసుక్కునే వారికి ఈ కొత్త కూరగాయతో మన సాంప్రదాయకమైన వంట చేసుకునే పద్ధతి మనకు
వివరిస్తున్నారు శ్రీమతి రత్నా శ్రీనివాస్.
మీ అభిప్రాయాలను, తప్పక మా comments విభాగములో పొండుపరచగలరు. మీ సలహాలు, సంప్రదింపులు మన ‘తెలుగుభోజనం’ కు అమూల్యమైనవి.
రమణ బంధకవి
సంపాదకుడు
నూల్ కోల్ పులుసు బెల్లం కూర
శ్రీమతి రత్నా
శ్రీనివాస్
పులుసు-బెల్లం అనగానే మనకు
అరటికాయ, కంద, కాకర, గోరు
చిక్కుడు మొదలైనవి గుర్తుకువస్తాయి. ఎందుచేతనంటే అవి మన అమ్మ, అమ్మమ్మ, బామ్మలు, వాళ్ళ ముందు తరం నుండి సాంప్రదాయపరంగా వస్తున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అల్లం ఖరీదు కూడా ఆకాశాన్నంటి వున్న ఈ రోజుల్లో నూల్
కోల్ కిలో 35 లేక నలబై రూపాయలకే లభ్యమవుతోంది. ఆరోగ్యపరంగా చూసిన ఒంటికి ఎంతో
మేలు చేసే కాయగూర. మరి అటువంటపుడు సంప్రదాయకరమైన పులుసు –బెల్లం నూల్ కోల్ తో
ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మీరు కూడా మార్కెట్లో
నూల్ కోల్ కనిపిస్తే తెలియని కూర అని అనుకోకుండా తప్పకుండా మా పులుసు-బెల్లం
రేసిపేని ప్రయత్నించి చూడండి.
వస్తువులు రెడీ చేయుటకు పట్టే
సమయం: పది నిముషములు
వండుటకు పట్టే సమయం: పదిహేను నిముషములు
కావలసిన వస్తువులు:
నూల్ కోల్ 2 కాయలు
ఎండు మిరప కాయలు 2(రెండేసి ముక్కలుగా తుమ్పుకోవచ్చును)
సెనగ పప్పు ½
టీస్పూన్
మినప పప్పు ½
టీస్పూన్
ఆవాలు 1/4టీస్పూన్
జీలకర్ర 1/4టీస్పూన్
ఇంగువ 10 గ్రాములు
ఉప్పు తగినంత
కారం 1/4టీస్పూన్
పసుపు చిటికెడు
చింతపండు రసం 1 టేబుల్ స్పూన్
బెల్లం 1
టేబుల్ స్పూన్
బియ్యప్పిండి 1 టీ స్పూన్
కరివేపాకు 4-5
రెబ్బలు
తయారు చేయు విధానం:
మొదట నూల్ కోల్ ని శుబ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
|
తరిగిన ముక్కల్ని ప్రెషర్ పాన్ లోకి తీసుకుని ముక్కలు మునిగేంతవరకు
(ఇంచుమించుగా 100ml) నీళ్ళు పోసి చిటికెడు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
|
మొదటి విజిల్ వచ్చేక మంటను తగ్గించి పది నిమిషాలు ఉంచాలి. రెండవ విజిల్
రాగానే స్టవ్ కట్టేసుకోవాలి.
|
ప్రెషర్ విడుదల అయ్యేలోపు ఒక కప్పులో నిమ్మపండు సైజంత చింతపండును
నానబెట్టుకోవాలి .
|
అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని గుండ్రాయితో గాని, అప్పడాల కర్రతో కాని చితక్కొట్టుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి.
|
ఇపుడు కుక్కర్ మూత తీసి ముక్కలని బైటకి తీసుకోవాలి. నీరు ఎక్కువైన పారబోయకుండా వేరే బౌల్లోకి తీసుకోండి. దానిని చారులో కానీ సాంబారులో
కాని వాడుకోవచ్చు.
|
ఒక బాండీ లేదా నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్
స్పూన్ నూనె వేసుకోవాలి
|
నూనె కాగేక సెనగపప్పు, మినపపప్పు వేసి రంగు మారేంత
వరకు వేయించుకుని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి.
|
ఆవాలు చిటపటలాడేక ఇంగువ, కరివేపాకు వేయాలి.
|
ఇపుడు ఉడికిన ముక్కలని పోపులో వేసి కలుపుకుని వేయించుకోవాలి. నానబెట్టిన చింతపండును, బెల్లం, ఉప్పు కూడా జత చేసి
ముక్కలను బాగా కలియబెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
|
ఇపుడు ముక్కలు చింతపండు, బెల్లం మిశ్రమాన్ని బాగా
పీల్చుకున్నాక ఒక టీస్పూన్ బియ్యప్పిండి, పావు టీస్పూన్ కారం వేసి బాగా
కలియబెట్టి రెండు నిమిషాలు మూత పెట్టుకుండ మగ్గన్నిచ్చి స్టవ్ ఆపుకోవాలి.
|
ఇప్పుడు తయారైన కూరను ఒక శుబ్రమైన
పాత్రలోకి మార్చుకోండి.
వడ్డించుటకు సలహాలు
మరియు ఇతరత్రా:
పులుసు
–బెల్లం కూరలు వేడి వేడి అన్నంలోకి బాగా రుచిగా వుంటాయి.
No comments:
Post a Comment