శ్రీమతి రత్నా శ్రీనివాస్
టమాటో
బాత్ బ్రేక్ఫాస్ట్ ఐటెంగా చేసుకొవచ్చు. దీనిని మసాలా ఉప్మా లేక కారబాత్ అని కూడా అంటారు.
కావలసిన
వస్తువులు
బొంబాయి
రవ్వ (సూజీ )
250 గ్రాములు
టమాటాలు
5 చిన్నవి
ఉల్లిపాయలు
2 పెద్ద సైజు
సెనగ
పప్పు
1 టీస్పూన్
మినపపప్పు
2 టీస్పూన్స్
ఆవాలు
1/2 టీస్పూన్
పచ్చి
మిర్చి
2 సన్నగా తరుక్కోవాలి
అల్లం
10 గ్రాములు సన్నగా తరుక్కోవాలి
కరివేపాకు
5-6 రెబ్బలు
ఉప్పు
రుచికి సరిపడా
పసుపు
చిటికెడు
తయారు
చేయు విధానం:
స్టవ్
మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కేక మంట తగ్గించి బొంబాయి రవ్వను వేయించుకోవాలి. రవ్వ వేయించుకోవటం వలన ఉప్మా ఉండలు
కట్టకుండా వుంటుంది. వేగిన రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇపుడు
బాండీ ని తిరిగి స్టవ్
పైన పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నూనే వేసి, కాగేక సెనగ పప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి.
రంగు మారేక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట లాడేక అల్లం, పచ్చి
మిర్చి వేసి వేయించుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేయాలి . పోపు వేగేక,తరిగిన ఉలిపాయాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెటుకున్న టమేటాలను వేసి మగ్గనివ్వాలి. మగ్గిన టమేటాలు ఉల్లిపాయలు కలిసి మంచి రంగును ఇవ్వటమే కాకుండా కమ్మటి వాసన గుబాళిస్తుంది. ఇప్పుడు నీరు పోసుకోవాలి
మనం
సాధారణంగా ఉప్మా చేసేటపుడు ఒక పాలు రవ్వకి, రెండు పాళ్ళు నీళ్ళు పోస్తాము. టమాటో
బాత్ కొంచెం పల్చగా వుంటే బాగుంటుంది. కాబట్టి మనం ఒకటికి నాలుగు నీళ్ళు
పోసుకోవాలి.
ఇపుడు
పోపులో పైన చెప్పిన కొలతలో నీళ్ళు పోసుకోవాలి. మంటను పెద్దది చేసి పెట్టుకోవాలి.
ఉప్పు, చిటికెడు
పసుపు వేసుకుని కలియ బెట్టుకోవాలి. నీళ్ళు మరిగిన తరువాత మంట తగ్గించి వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను
నెమ్మదిగా బాండిలోకి కలియబెట్టుకుంటూ
పోస్తూ
వుండాలి. ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలియబెట్టుకోవాలి. కొద్ది సేపటికి ఉప్మా
దగ్గరకి వస్తున్ది. రవ్వ ఉడికిందో లేదో చూసుకుని పైన ఒక స్పూన్ నెయ్యి కాని, నూనె కాని వేసుకుని, ఒక సారి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు స్టవ్
మీద ఉంచాలి.
ఒక
చిన్న మూకుడు లో 1/4 టీస్పూన్
నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి .
ఇపుడు
ఉప్మాను ఒక హాట్ కేస్ లోకి కాని బౌల్ లోకి కాని మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పుతో
అలంకరించుకోవాలి. '
ఉప్మాని సెనగ పచ్చడి కాని, పొడితో కాని లేదా ఏదైనా పచ్చడితో కాని తినవచ్చు. కొంచెం పులుపు
కావాలనుకునే వాళ్ళు కొంచెం పైన నిమ్మ కాయ పిండుకోవచ్చు.
No comments:
Post a Comment