కిచెన్ క్విజ్
శ్రీమతి
నయన కస్తూరి
వాణి తన స్నేహితురాలి
కుటుంబాన్ని ఒక రోజు భోజనానికి పిలిచింది. స్నేహితురాలు "సరే లంచ్ కి వచ్చి
సాయకాలం దాకా కబుర్లు చెప్పుకుని , రాత్రికి ఏకంగా
భోజనం చేసి వెళ్తాము" అని చెప్పింది. వాణి సంతోషంగా, “అంత
కంటేనా! తప్పకుండా రావాలి" అని ఆహ్వానం పలికింది .
ఏమేమి
చేయాలో అన్ని తెచ్చుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంది. కాకపొతే మిమ్మల్ని ఒక సహాయం
కోరుతోంది. తనకేమి కూరలు కావాలో తనిచ్చే ఆధారాలు బట్టి కనిపెట్టి ఫ్రిజ్ లోంచి మీరే తీసివ్వాలి. ఇదే మన వంటింటి ఛాలెంజ్!
వాణి ఇచ్చిన ఆధారం ఏమిటంటే ఆవిడ కొన్ని వాక్యాలు మనకు ఇచ్చి దానిలో ఉన్న
ఖాళీలు మనలని పూరించ మంది. ఒకొక్క వాక్యం లో రెండు కూరగాయలు వుంటాయి. ఆ రెండు
కూరగాయలలో మొదటి అక్షరం తప్ప మిగతా అక్షరాలూ అన్నీ ఒకటే. మొదటి అక్షరం మాత్రం వేరే
గా ఉంటుంది. మరి మీలో ఎవరు తెలివిగా ముందుగా కనిపెట్టి వాణి కి కూరగాయలు అందించి ఆవిడ తొందరగా వంట ముగించడానికి సహాయపడతారో చూద్దామా? ఇక ఆవిడ ఇచ్చిన వాక్యాలు చూద్దాము.
· నేను _ ర కాయ పప్పు చేసి , _ ర కాయ పులుసు పెడతాను . వాటికి తోడుగా
* _ డ కాయ పోపు కూర చేసి, _ డ కాయ వేపుడు
చేస్తే అందరూ ఇష్టం గా తింటారు.
· సరే మరి ఇక
పచ్చళ్ళు అంటారా ? _ ల్లం వేసి, _ ల్లం పచ్చడి చేస్తే సరి
.
మర్చిపోయా! ఆవిడ స్నేహితురాలి భర్త పచ్చళ్ళ ప్రియుడండీ బాబూ! కనీసం మూడు పచ్చళ్ళు వుండాలిట . అందుకని
* _ కాయ కాల్చి పచ్చడి మరియు _కాయ పచ్చడి కూడా చెయ్యాలి .
అంతే కాదు మధ్యాహ్నానికి చిరుతిళ్ళు కూడా ప్లాన్ చేసిందిట. ఈ రెండు
స్నాక్స్ చెప్పుకోండి .
· మధ్యాహ్నం
టీ తో పాటు _కోడీలు, _ కోడీలు
చేసానంటే అందరు కాలక్షేపం గా తింటారు .
·
రాత్రికి _కర కాయ వేపుడు చేసి, _కర కాయ
పెసరపప్పు వేసి చేసేస్తే, పులుసు, పచ్చళ్ళు
పోద్దుటవే సరిపోతాయి కదండీ ?
మరిక ఆలస్యం
చేయకుండా ఆవిడకి కావలిసినవి ఏమిటో గుర్తించి తెచ్చిస్తారు కదూ? ఇక మీలో ఎవరు ముందో చూద్దాము.
కిచెన్ క్విజ్ జవాబులు :
ReplyDelete1. బీర కాయ పప్పు , సొర కాయ పులుసు .
2. బెండకాయ పోపు కూర , దొండ కాయ వేపుడు
3. బెల్లం వేసి,అల్ల్లం చట్నీ చేస్తే సరి .
4. వంకాయ కాల్చి పచ్చడి ,దోస కాయ పచ్చడి.
5. టీ తో పకోడీలు, చేగోడీలు
6. రాత్రికి కాకర కాయ వేపుడు, పెసర పప్పు కూర తెలియ లేదు.
క్విజ్ ఇచ్చిన విధానం చాల బాగుంది.మున్ముందు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాల కోసం ఎదురు చూస్తున్నాము
లక్ష్మీ