బామ్మ
గారి రుచులు
మన ‘తెలుగు
భోజనం’ బ్లాగ్ ని చదివి ఆనందించడమే కాకుండా, 75 ఏళ్ల ఒక బామ్మగారు పాత
రోజులు,
వంటకాలు గుర్తుకు తెచ్చుకోవడమే కాకుండా, ఎంతో ఉత్సాహంతో, స్వయానా ఆనాటి
ఒక చక్కటి
వంటకం గురించి వివరిస్తూ వ్రాసి మాకు పంపేరు. వారికి మన అందరి తరపున
ధన్యవాదాలు
తెలుపుతూ, సగర్వం గా అ వంటకాన్ని మీ ముందుకు తెస్తున్నాను. మీరందరూ
తప్పక ఈ
వంటకాన్ని వండుకుని, తిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
రమణ
సంపాదకుడు
‘ములక్కాడ- బియ్యంపిండి’ తీపి వంటకం
- బామ్మ గారు, హైదరాబాద్
ములక్కాడ చెట్టు ఆ కాలం లో ప్రతి ఇంటికి
వెనక వైపున వేసుకునే వారు. వాటిని మాములు గా ఏ చారులోనో, పులుసులోనో సువాసన కోసం
వేసుకునే వారు. ములక్కాడ, రుచి సువాసన కలిగించటమే కాకుండా చక్కటి ఆరోగ్య ప్రదాయని
అని అందరకు తెలిసిందే! ఇవే కాక, ఆ రోజులలో పిల్లలు, పెద్దలు చాల ఇష్టంగా తినే ఓక
తీపి వంటకం కూడా ఈ ములక్కాడ తో చేసేవారు. అదే ములక్కాడ-బియ్యం పిండి వంటకం.
కావలసిన వస్తువులు:
ములక్కాడలు : నాలుగు లేక ఐదు
బియ్యం : సుమారు 100 గ్రాములు
బెల్లం: ఒక కప్పుడు సన్నగా తరిగి
కొబ్బరి తురుం : ఒక కప్పుడు
యాలకులు : 2(పొడి చేసి)
చేసే విధానం:
ములక్కాడలను రెండు అంగుళాల పొడువు
ముక్కలుగా తరుక్కోవాలి. వాటిని ఒక గిన్నె లోకి తీసుకుని, ఒక గ్లాసుడు నీళ్ళు పోసి
స్టవ్ మీద సన్న సెగన ఉడికించాలి.
బియ్యాన్ని చక్కగా కడిగి తగినంత నీరు
పోసి ఒక అర గంట నాన బెట్టాలి. తరువాత నీరు వడ బోసి, నానిన బియ్యాన్ని, కొబ్బరితురుమును
కలిపి మిక్సీ లో వేసి, కాసిని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిలో నే తరిగిన
బెల్లం పొడిని కలిపి మరి కొంచెం తిప్పాలి.
ఈ మిశ్రమాన్ని తీసి, ఉడుకుతున్న
ములక్కాడ ముక్కలలో వేసి, కొంచెం సేపు కలియ తిప్పాలి. యాలకుల పొడి పైన జల్లాలి. బెల్లం
పాకం వచ్చి ములక్కాడ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మన రుచి కరమైన, సువాసన
గొలిపే ములక్కాడ- బియ్యంపిండి తీపి వంటకం తయార్!
అప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసి,
ప్లేట్ లో కాని, చిన్న కప్పు లో కాని పెట్టి ఇస్తే చక్కగా ఉపహారం గా తింటారు.
పాత రుచులని కొట్టి పడెయ్యకుండా, మరి
దీనిని వండుకుని, తిని ఆనందిస్తారని తలుస్తాను.
తెలుగు భోజనం బ్లాగ్ చాల ఆసక్తి కరమైన విషయాలతో, మన సాంప్రదాయాలను మరొక్క సారి గుర్తు చేస్తూ వుందని చెప్పటానికి చాల సంతోషిస్తున్నాము. జంధ్యాల పౌర్ణమి గురించి వివరించి నందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteబామ్మ గారి పురాతన మైన ములక్కాడ వంటకం అందించినందుకు చాల ఆనందించాము. వెంటనే వండుకుని తినాలన్న కోరిక కలిగింది. మీరు వీలు అయినపుడల్లా మరగు పడి పోయిన మన పురాతన వంట కాలు మరిన్ని అందించాలని మా కోరిక.