Thursday, October 23, 2014

ఈ నాటి స్వీట్ – మిటాయిలలోకే రాజా – మనదైన మడత కాజా!


మడత కాజా

శ్రీమతి నయన కస్తూరి

మడత కాజాలు : కావలిసిన వస్తువులు:
ఒక అరకిలో మైదా పిండి
అరకిలో పంచదార
ఒక చిన్న కప్పుడు పెరుగు
తినే సోడా ఒక చిటెకెడు
నెయ్యి చిన్న కప్పుడు
పిండిలో కలపడానికి వందగ్రాముల నూనె
మరియు   వేయించడానికి సరిపడా నూనె.

తయారు చేసే విధానం:
ముందుగా ఒక మూకుడులో వంద గ్రాముల నూనె పోసి స్టవ్ మీద వేడి చెయ్యాలి. మైదా పిండిని జల్లించుకుని ఒక పెద్ద బౌల్ లో వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక మైదా పిండి లో వేసి బాగా తడిసేలా కలుపుకోవాలి పెరుగు, సోడా ఉప్పు  కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసి, చపాతీ పిండిలా కలుపుకోవాలి. పైన ఒక తడి గుడ్డ కప్పి, ఒక అరగంట సేపు ఉంచాలి. ఈ లోగా ఒక వెడల్పు గిన్నెలో పంచదార వేసి, ఒకటికి- ఒకటి  నీరు పోసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి, పాకం పట్టుకోవాలి. పాకం బాగా లేతగా గులాబ్ జామూన్ పాకం లా ఉంటే చాలు. స్టవ్ మీద నుండి దించి, బాగా చల్లారనివ్వాలి.

అరగంట అయిన తర్వాత మైదా పిండిని కొంచెం తీసుకుని, రెండు చపాతీలను  చేసుకుని, ఒక చపాతీ మీద కొంచెం నెయ్యి వేసి చపాతీ అంతా అలమి, దాని మీద కొంచెం పొడి మైదా పిండి జల్లాలి. దాని మీద రెండవ చపాతీని పెట్టి మళ్ళి ఇంకొంచెం పెద్దగా చపాతీని వత్తుకోవాలి. వత్తిన తర్వాత దాని మీద కూడా బాగా నేయి రాసి, పైన పొడి మైదా పిండిని జల్లాలి. దానిని చాపలాగా చుట్టి , చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకొక్క ముక్కని చపాతీ కర్రతో మెల్లిగా వత్తి, కాజా ఆకారం వచ్చేలాగా చేసుకోవాలి.

ఒక మూకుడులో నూనె వేసి, వేడెక్కాక స్టవ్ ఆపి, వేడి తగ్గాక తయారుచేసుకున్న కాజాలను నూనె లో వేసి, స్టవ్ వెలిగించి, సన్న సెగ మీద రెండు వైపులా బాగా వేయించుకోవాలి. వేగిన కాజాలను చల్లారిన పంచాదారపాకంలో బాగా మునిగేలా వేసుకోవాలి. రెండో వాయి కాజాలను వేసుకుని, అవి వేగాక మొదటి సారి వేసిన కాజాలను తీసి పళ్ళెం లో ఆరబెట్టుకోవాలి. ఇలా పిండిని అంతా కాజాలుగా వేయుంచుకుని, పాకం లో వేసుకోవాలి. పాకం పీల్చాక ఆరబెట్టుకోవాలి. అంతే స్వీట్ స్వీట్ కాజా తయార్!

  


 





పాఠకులకు గమనిక:
ఈ రోజు తో అశ్వీయజ మాసం పూర్తి అయ్యి, పరమ పవిత్రం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం లోకి రేపు అడుగు పెడతాము. కార్తీక మాసపు విశేషాలు, పండుగలు, పూజలు గురించి మనం మరియొక వ్యాస పరంపరలో చక్కగా గుర్తుకు తెచ్చుకుందాం. కనుక మనవి ఏమిటంటే, తామెల్లరూ, కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపరను కూడా చదివి, ఆనందించి, ఆచరించి, ఆదరించగలరు.

రమణ బంధకవి

సంపాదకుడు  


No comments:

Post a Comment