Monday, October 6, 2014

తెలుగు సాహితీ పదాలు – చమత్కారాలు!


ముందుమాట:

తెలుగు భోజనం ఎంత కమ్మనైనదో తెలుగు సాహిత్యం కూడా అంత కమ్మదనాల పంట!
తెలుగు సాహిత్యం అనగానే మనకు శ్రీ కృష్ణ దేవరాయలవారి కాలం మదిలో మెదిలి తీరుతుంది రాయల వారి  ఆస్థానం లోని అష్టదిగ్గజాలు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఎనిమిది మహాకవులను ఒక్క సారి స్మరించుకుందామా? అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన్న, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు మరియు  తెనాలి రామకృష్ణుడు. అందరూ మహానుభావులే! ఎన్నో గ్రంథాలు  ఆవిష్కరించారు. ఇప్పుడు మనం ఈ అష్టదిగ్గజాల్లో రామరాజభూషణుడు ఒక పదంతో చేసిన పదవిన్యాసం చూద్దాం. దీనిని సేకరించి పంపినవారు మన పాఠకులు శ్రీమతి జోస్యుల ఉమాధర్.

రమణ బంధకవి.

సంపాదకుడు



సాహితీ పద విన్యాసం -  'రమాకుమార'


సేకరణ : శ్రీమతి జోస్యుల ఉమాధర్

రామరాజభూషణుడు  తెలుగు వాజ్ఞాయాభిమానులందరికి సుపరిచితుడైన కవి. రామరాజుభూషణుడి చేతి కలం నుండి జారిన ఆణిముత్యాల్లో 'కావ్యాలంకారసంగ్రహం', 'వసుచరిత్రము','హరిశ్చంద్రోపాఖ్యానం' ఎంతో విశేషమైనవి. ఆయన తన సాహిత్యం లో ఒకానొక చోట 'రమాకుమార' అనే విచిత్రమైన పదప్రయోగం చేసారు. ఈ పదం యొక్క అర్ధం 'మన్మధుడు'. ఈ పదాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ పదం  చేసే విచిత్ర  విన్యాసాలు మనం ఆనందించవచ్చును.

'రమాకుమార' పదాన్ని మనం ఎడమ నుండి కుడికి చదివినా కుడి నుండి ఎడమకు చదివినా అదే పదమూ,అదే అర్ధమూ వస్తుంది. దీనినే ఆంగ్ల భాష లో ‘పాలిండ్రోంమ్’ అని అంటారు. ఇదొక్కటే కాదండోయ్! ఇంకా చాలా చమత్కారాలే దాగి ఊన్నాయి. 

'రమాకుమారం' లోని '' తీసివేస్తే 'మాకుమార' అవుతుంది దీని అర్ధం కూడా 'మన్మధుడే'!
మొదటి రెండు అక్షరాలూ 'రమా' తీసి వేస్తే 'కుమార' వుంటుంది. ఈ పదం యొక్క అర్ధం కూడా 'మన్మధుడే'!
మూడు అక్షరాలూ 'రమాకు' తొలగిస్తే 'మార' అవుతుంది. ఇది కూడా 'మన్మధుడు'అనే అర్ధాన్ని ఇస్తుంది!
'రమాకుమా' తీసి వేస్తే '' మిగులుతుంది. తెలుగు నిఘంటువు ప్రకారం ఈ ఏకాక్షరం '' యొక్క అర్ధం కూడా  'మన్మధుడుఅని చెపుతారు.

చూసారా 'రమాకుమార' అన్న పదం వాడి రామరాజభూషణుడు ఎన్ని చమత్కారాలు చూపించాడో! మహామహులైన మన కవులు చేసిన ఇలాంటి విచిత్రాలు ఎన్నో మనకు  తెలుగు సాహిత్యం లో కనపడతాయి.



No comments:

Post a Comment