Tuesday, September 23, 2014

నవరాత్రి ప్రత్యేక వ్యాస పరంపర: 3 - శరన్నవ రాత్రులు---సర్వ సౌభాగ్య సోపానాలు: మూడవ భాగం



శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


ఈ రోజు మనం, నవరాత్రులలో భక్తులు అమ్మవారిని ఒక్కో రోజు ఏయే అలంకరణలతో అర్చించి, ఏ విధమైన నివేదనలు సమర్పిస్తారో గుర్తు చేసుకుందాం. ముందు మనవి చేసినట్టు, ఈ అలంకారాలు ప్రాంతనుసారం, క్షేత్రనుసారం గా స్వల్పమైన మార్పుల తో ఉండవచ్చు. ఇక తరువాతి రోజులలో మనం ఒక్కో అలంకారం గురించి, మరి సంబంధిత నివేదనలు, వాటిని తయారు చేసే విధానం గురించి రోజువారీగా తెలుసుకుందాం.

అలంకారాలు – నివేదనలు:

మొదటి రోజు -  శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవీ అలంకారం
                      నివేదన -  తీపి బూంది, సుండలు.  
రెండవరోజు -     శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారం
                      నివేదన – పెసర పప్పు పాయసం.  
మూడవరోజు -  శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
                      నివేదన దద్దోజనం, కట్టె పొంగలి.   
నాలుగవ రోజు - శ్రీ గాయత్రీ దేవి అలంకారం
                      నివేదన - అల్లపు గారెలు. 
అయిదవరోజు -  శ్రీ లలితాత్రిపురసుందరీ దేవి అలంకారం
                      నివేదన - పులిహోర,  పెసరబూరెలు. 
ఆరవరోజు -       శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం
                      నివేదన - పూర్ణాలు,  క్షీరాన్నం.
ఏడవ రోజు -      శ్రీ సరస్వతీ దేవి అలంకారం
                       నివేదన - అన్నం పరమాణ్ణం,  దద్దోజనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు.
ఎనిమిదవ రోజు - శ్రీ దుర్గా దేవి అలంకారం
                        నివేదన - పులగాన్నం, పులిహోర.
తొమ్మిదవ రోజు - శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారం
నివేదన - పులగాన్నం,  పులిహార,  గారెలు,  నిమ్మరసం,  వడపప్పు, పానకం.

ఈ ఏడాది అష్టమి, నవమి తిథులు రెండూ ఒకే రోజు అనగా అక్టోబర్ 2 న పడటం వలన రెండు అలంకారాలు ఆ రోజే జరప బడుతున్నాయి.

ఈ నివేదనలతో పాటు గా తమ శక్తి విభవాల కొద్ది అన్ని రకాల ఫలాలను సమర్పించుకుంటారు.

ఇలా తొమ్మిది రోజులు ఆయా అలంకారాలతో పూజించి విజయదశమి నాడు పరిపూర్ణ మూర్తి అయిన  జగన్మాతను  శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం లో పూజించి, లడ్డూ తో సహా మహా నివేదన చేస్తారు.  ఇక సామూహికంగా భక్తులు వీదుల్లోను, భవన సముదాయాలలోనూ అమ్మవారి పెద్ద మూర్తులను నిలిపి పూజలు జరిపే వారు ఆఖరి రోజున సాంప్రదాయకం గా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విస్తారు.

ఇక రేపటినుండి రోజుకొక్క అలంకారాన్ని, సంబంధిత నివేదనలని, వాటిని చేసే విధానాన్ని  గుర్తు చేసుకుందాం.

రేపటి వ్యాసం: శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవీ అలంకారం.



శుభం భూయాత్

            








No comments:

Post a Comment