Thursday, September 4, 2014

తెలుగు భోజనానికి శ్రీకారం – ‘మొదటి ముద్ద’


ముందు మాట:

“ఏమోయి! ఆఫీస్ కి ఆలస్యం అవుతోంది, తొందరగా నాలుగు మెతుకులు పడేస్తే తినేసి వెళ్తాను”. 
ఇది ప్రతి నిత్యం ఎదో ఒక ఇంటిలో ఆసామి శ్రీమతి తో అనటం వింటూ వుంటాం. ఆవిడ కంగారుగా 
తెచ్చి వడ్డించటం, ఈయన ఎదో గుటుకు గుటుకు మని మింగేసి భోజనం అయిందనిపించటం ఒక 
దృశ్యం అయితే, మరి ఇల్లాలి భోజనం వేళకి సరిగ్గా పోస్ట్ వాడో, కేబుల్ బిల్ వాడో, ఎవరో ఒకరు 
ఊడి పడటం ఆవిడ కూడా ఎదో భోజనం అయిన్దనిపించటం జరుగుతూ ఉండటం షరా 
మామూలే! మరి పద్ధతిలో భోజనం చేయక పోవడం ఒక లోటు అయితే, మరి చక్కటి పోషక 
విలువలతో ఉన్న షడ్రుచుల తెలుగు భోజనానికి శ్రీ కారం ఎలా చుడతారు అని ప్రశ్నిస్తూ,  శ్రీమతి 
నయన గారు, మన సాంప్రదాయ భోజన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తెలుగు భోజనానికి ఎలా 
శ్రీకారం చుట్టాలో చక్కగా విశదీకరించారు. ఇక చదువుదాము. 

రమణ బంధకవి


సంపాదకుడు




తెలుగు భోజనానికి శ్రీకారం ‘మొదటి ముద్ద’



శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


మన పెద్దలు మన తెలుగు భోజనాన్ని సమతుల్యం గా అమర్చి పెట్టారు.  అన్నిపోషకవిలువలు సమానంగా మనకు లభ్యమయ్యేలా మన భోజనాన్ని తీర్చిదిద్దారు. కాని ఇప్పుడు మనం మన కిష్టమొచ్చిన రీతి లో దాని రూపురేఖలు మార్చివేసాము అన్నది అక్షర సత్యం. అసలు మనం భోజనం ఎందుకు చెయ్యాలి అంటే, శారీరక మరియు మానసిక ఎదుగుదల కోసం. ప్రాణం ఉన్న ఏ జీవికైనా ప్రాణం నిలుపుకోవడానికి మరియు ఎదుగుదలకు రకరకాల పోషక పదార్ధాల అవసరం ఉంటుంది. అందుకని  మన పెద్దలు వారి అపారమైన అనుభవం మరియు ముందుచూపుతో ఆ పోషక పదార్ధాలన్నీ మన భోజనం ద్వారా అనునిత్యం మనకు లభ్యమయ్యేలా మన భోజనంలో పొందుపరిచారు.

మనం చిన్న పిల్లల్ని ఆడించేటప్పుడు వారి చేయి తెరవమని పట్టుకుని 'అన్నంపెట్టి,  పప్పేసి, కూరేసి, పచ్చడేసి, పులుసేసి, పెరుగేసి, అన్ని   నోట్లో పెట్టి...' అంటూ ఆడిస్తాము.  గుర్తుంది కదూమన భోజనంలో పిండిపదార్ధాలు, కూరగాయలు, మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్స్ మరియు కాల్షియం కలిగిన పదార్ధాలు పొందుపరిచారు.  మరి అందుకే కదండీ మన భోజనంలో అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, నెయ్యి, పెరుగు, చోటు చేసుకున్నాయి!

కాని ఈ కాలం పిల్లలు కొంతమంది, అంతే కాదు పెద్దలు కూడా అనుకోండి, ఈ రోజు అన్నం బదులు పూరీలు తిందాము...అని కొంతమందిపులిహార తినేద్దాము అని కొంతమంది.... ఇలా ఎవరికీ తోచినవి వాళ్ళు చేసుకుని తినేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక పూట అంటే సరే!  కాని తరుచుగా మాత్రం అలా చేయవద్దని నా సలహా! కనీసం పగటి భోజనం తప్పనిసరిగా పరిపూర్ణంగా ఉండాలి.  లేకపోతే  మీకు కొన్ని కొన్ని పోషకవిలువలు తగ్గిపోయి, సరి అయిన ఎదుగుదల ఉండదు. “సరే ఇక నుండి అలాగే తింటాము, మా పిల్లలకూ పెడతాము!” అంటారా?  మంచి మాట!


ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి.  మీకు 'మొదటి ముద్ద' అని ఎప్ప్పుడైనా విన్నట్టు గుర్తుందా? మన అమ్మమ్మలు, బామ్మలు తప్పని సరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు దీన్ని అందించేవారు. ఆ రోజుల్లో భోజనాన్ని మొదటి ముద్ద  తోటే ఆరంభించే వారు. ఇప్పటికి పెద్దవారుండే  ఇళ్ళల్లో వారికి  తప్పనిసరిగా మొదటి ముద్ద వుండాలి. “ఏమా మొదటి ముద్ద? అమ్మ ముద్ద,నాన్న ముద్ద విన్నాం కాని ఈ మొదటి ముద్ద ఏమిటబ్బా?” అనుకుంటున్నారా? మొదటి ముద్ద అంటే ఈ రోజుల్లో స్టార్టర్స్ అన్న మాట!  ....(సశేషం)

 







No comments:

Post a Comment