కామాక్షి
కబుర్లు:
‘వాట్స్ఎప్ విచిత్రాలు’
(రెండవ భాగం)
శ్రీమతి రత్నాశ్రీనివాస్
బెంగళూరు
(గత సంచిక: ఏమిటీ! వాజప్పా?” ఆశ్చర్యబోతూ అడిగేరు
సూరిడమ్మ గారు. తెలిసీ తెలియకపోయిన వాజప్ అని కుర్రకారు లాగా స్టైల్ గా బాగానే
అన్నారు. (సశేషం)
“మన అమ్మలుకి కూడా పంపచ్చుటే ఈ వాజప్పు!” "ఆ పంపచ్చు అత్తయ్య! అమ్మలు వదిన కి కూడా వుంది వాట్సప్" చెప్పింది కామాక్షి.
“మామ్మ! తాతా! మీకు ఫోటో తీసి అమ్మలు అత్తయ్య కి
పంపిస్తాను” అంటూ పట్టు క్లిక్కు మని ఫోటో తీయటం, అమ్మలకి పంపడం, బాగుందని తిరుగు
జవాబు రావడం రెండు మూడు నిమిషాలలో జరిగిపోయాయి. సూరిడమ్మగారు మురిసిపోయారు.
రాత్రి ప్రొద్దు పోయేంతవరకు టింగు టింగు మని మోగుతూనే
వుంది. వాటికి కామాక్షి జవాబులు ఇచ్చేసరికి అర్ధ రాత్రి దాటింది. మరునాడు ఉదయం ఇదే తంతు. కామాక్షి వంటింట్లో పని
చేసుకుంటూనే మెస్సేజెస్ చూసుకుంటోంది.
“మా మార్నింగ్ కాఫీ!” అంటూ పొగలు గక్కే కాఫీ కప్పు
ఫోటోతో మొదలయ్యాయి.
ఇదిగో ఇవాల్టి మా బ్రేక్ ఫాస్ట్ అంటూ పెసరట్టు–ఉప్మా, దానికి
మేము పెట్టి పుట్టలేదులే అని వాపోతూ వనజక్క, అన్ని పూటాలా మా ఆహారం ఇదే అంటూ మొలకలు
మొలిచిన పెసలు-గుగ్గిళ్ళు పంపింది.
మా ఇంట్లో మొట్ట మొదట వేసిన సన్నజాజి మొగ్గ అని ఒకరు
పంపితే, ముద్దులు మూటగట్టే మా ముద్ద
మందారం చూడండి అంటూ మరొకటి; మేము ఈ రోజు గంట మార్నింగ్ వాక్
చేసామంటూ చెమటలు పట్టిన మొహాలతో
జగన్నాధం అన్నయ్య, వదిన; అందానికి అందం మా అరటి పిలక అంటూ అమ్మలు వదిన; అలా
వస్తూనే వున్నాయి.
కామాక్షి పని ఆగిపోయింది. మొదటి కాఫీ గ్రుక్క ఇంకా
గొంతులో పడనే లేదు, ఇంతలోనే మేము ఈ రోజు లంచ్ కి పాట్టోలి ప్లాన్ చేసామంటూ పద్మ
అక్క; కొంచెం రెసిపీ చెప్పుదూ! అంటూ రేవతి వదిన; పెళ్లై ఇన్నేళ్ళఐన పాట్టోలి ఒక్కసారి
కూడా చేయలేదా!; ఆశ్చర్య పోతూ అరుంధతి అత్తయ్య; అసలు ఆవిడ వంట చేసింది ఎప్పుడు కనుక
ఇప్పుడు పాట్టోలి రెసిపీ అడగటానికి
అని రాంబాబు అన్నయ్య ఛలోక్తి!
ఆ....మీరు కష్టపడి
చేసే వాళ్ళు, మేము తిని కూర్చునే వాళ్ళం, రేవతి వదిన రిటార్టు; బాగానే
వుంది సంబరం! వాట్సప్ లో మీ మొగుడు పెళ్ళాల సరసాలు....దీర్ఘాలు తీస్తూ దుర్గ
పిన్ని; ఇలా కొంతసేపు రసవత్తరంగా సాగింది.
కామాక్షికి ‘వాట్సప్’
ఏమిటో పూర్తిగా అర్ధమైపోయింది.
ఇక ఇకలు - పకపకలు; కేరింతలు – కవ్వింతలు; చలోక్తులు –విరుపులు;
వంట –వార్పులు; విందులు –వినోదాలు; వియ్యాలు-కయ్యాలు; రెసిపీలు, మొక్కలు-పూలు, చెట్లు –చేమలు ; కట్టడాల్లో
వున్న ఇళ్ళు - కొనబోయే స్థలాలు; సలహాలు –సంప్రదింపులు; పెళ్లి సంబంధాలు-నిశ్చయ
తాంబూలాలు; కొత్త కార్లు –కొత్తగా కొన్న స్టీలు గిన్నెలు; దర్శించిన స్థలాలు -దర్శనీయ
స్థలాలు, ప్రవచనాలు - పుణ్య క్షేత్రాలు; పుట్టిన రోజు పండుగలు, శ్రావణ మాసం నోములు;
కొత్త అల్లుడి ఆషాడ పట్టి –కొత్త కోడలి మంగళగౌరి వ్రతం; పిల్లలు –వాళ్ళ ప్రైజులు; ఆటపాటలలో
విరగొట్టుకుని చేతులకు వేయించుకున్న ప్లాస్టర్లు; చెక్కుకుపోయిన మోకాలి
చిప్పలు; రాజకీయాలు - కొత్త రాజధానులు
......ఇలా ఒక్కటేమిటి సమస్త విషయాలకి ‘వాట్సప్’ వేదికైందని గ్రహించగలిగింది.
“ఏమిటి చేస్తున్నావమ్మా?” మెస్సేజెస్ లో పూర్తిగా మునిగిపోయిన కామాక్షి మామగారి
ప్రశ్నకి ఉలిక్కి పడి “వాట్సప్ చూస్తున్నాను మామయ్యా” చెప్పింది.
“వడపప్పు చేస్తున్నావా? ఇవాళ ఏమిటి విశేషం?” అడిగారు.
“వడపప్పు కాదు మామయ్యా! వాట్సప్!” అంటూ సెల్ ఫోన్
చూపించింది.
“ఓ!” అర్ధం అయి అవ్వనట్లు హాల్లో కి
పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు.
ఇంక కొంతసేపు ఫోన్ ముట్టుకోకూడదని, పని ముగించుకుని
కాని దాని జోలికి వెళ్లకూడదని
No comments:
Post a Comment